logo

పద్మశాలీలు చైతన్యవంతం కావాలి

పద్మశాలి భవన్‌ కేంద్రంగా పనిచేసే సంఘాలతోనే ప్రతిఒక్కరు కలిసి రావాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ సూచించారు. ఆదివారం రాత్రి నారాయణగూడ, రాజ్‌మోహల్లాలోని పద్మశాలి భవనంలో ‘తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం’.

Published : 27 Mar 2023 01:33 IST

లోగో ఆవిష్కరించిన ఎల్‌.రమణ, గుండు సుధారాణి, గూడూరి ప్రవీణ్‌, పొన్నాల శ్రీరాములు ఇతరులు..

నారాయణగూడ, న్యూస్‌టుడే: పద్మశాలి భవన్‌ కేంద్రంగా పనిచేసే సంఘాలతోనే ప్రతిఒక్కరు కలిసి రావాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ సూచించారు. ఆదివారం రాత్రి నారాయణగూడ, రాజ్‌మోహల్లాలోని పద్మశాలి భవనంలో ‘తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం’ ఆవిర్భావ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీలు చైతన్యవంతులు కావాలని, రాజ్‌మోహల్లా సంఘాలకే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. సంఘం కన్వీనర్‌ మచ్చ ప్రభాకర్‌రావు అధ్యక్షత వహించారు. వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, పవర్‌లూమ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, మాజీ ఎమ్మెల్యే పొన్నాల శ్రీరాములు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, సాంబారి సమ్మారావు, జిల్లాల నేతలు కవర్తపు మురళీ, కత్తుల సుదర్శన్‌, బొమ్మ రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని