భారత్ జోడో ఆలిండియా క్రికెట్ ఛాంపియన్‌గా తెలంగాణ జట్టు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ జోడో ఆలిండియా(అండర్ 19) డేఅండ్‌నైట్ టీ20 లీగ్ క్రికెట్ ఛాంపియన్‌షిప్-2023లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది.
విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న మాణిక్‌రావు ఠాక్రే, చిత్రంలో తారీక్ అన్వర్, రోహిత్ చౌదరి, వీహెచ్ తదితరులు
నారాయణగూడ, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ జోడో ఆలిండియా(అండర్ 19) డేఅండ్‌నైట్ టీ20 లీగ్ క్రికెట్ ఛాంపియన్‌షిప్-2023లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. ఎల్బీస్టేడియంలో శనివారం రాత్రి తమిళనాడు-తెలంగాణ జట్ల మధ్య సాగిన తుదిపోరులో తెలంగాణ జట్టు గెలుపొందింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర సహాయ మంత్రి తారీక్ అన్వర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సయ్యద్ సాధిక్, ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంబుల శ్రీకాంత్‌గౌడ్, ఆది అవినాష్, రజనీకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!
-
World News
China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు
-
Movies News
Ram Charan: రామ్ చరణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు..: బాలీవుడ్ డైరెక్టర్
-
Sports News
CSK vs GT: ఇదంతా ‘మహి’మే: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
-
General News
వీసీ ఛాంబర్లో టేబుల్‌పై కూర్చొని.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన
-
World News
Elon Musk: చైనాలో ల్యాండ్ అయిన ఎలాన్ మస్క్..!