logo

వివాహ బంధం పటిష్ఠతకు న్యాయ సలహా అవసరం

ప్రైవేటు రంగంలో ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు హైదరాబాద్‌లో తొలి ప్రయోగమని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. 

Published : 27 Mar 2023 01:32 IST

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, చిత్రంలో రాపోలు భాస్కర్‌

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ప్రైవేటు రంగంలో ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు హైదరాబాద్‌లో తొలి ప్రయోగమని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు.  ఆదివారం సైదాబాద్‌ డివిజన్‌ కల్యాణ్‌నగర్‌లో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఏర్పాటు చేసిన ‘ప్రి మెరిటియల్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌’ను ఆయన ప్రారంభించారు. ‘పెండ్లికి ముందు... తర్వాత’ వివాహ వ్యవస్థ పటిష్ఠతకు న్యాయ సలహాలతో కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు. సమాజంలో ఇదొక సామాజిక పరివర్తనకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ సలహా, అవగాహనతో వివాహ బంధం పటిష్ఠతకు, కలహాల నివారణకు ముందస్తు వివాహ అవగాహన కేంద్రంను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని