logo

ఉత్సాహంగా 5కే మెగా హార్ట్‌ రన్‌

యశోద హాస్పిటల్స్‌, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఐటీ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5కె మెగా హార్ట్‌రన్‌ పేరిట పరుగును చేపట్టారు.

Updated : 27 Mar 2023 04:08 IST

పరుగులో పాలుపంచుకున్న టీసీఎస్‌ ఉద్యోగులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: యశోద హాస్పిటల్స్‌, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఐటీ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5కె మెగా హార్ట్‌రన్‌ పేరిట పరుగును చేపట్టారు. యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గోరుకంటి పవన్‌, టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్నతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. టీసీఎస్‌ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పరుగులో పాలు పంచుకున్నారు. యశోద ఆసుపత్రి నుంచి ప్రారంభమైన పరుగు టీసీఎస్‌ డెక్కన్‌ పార్క్‌ మీదుగా తిరిగి యశోద ఆసుపత్రి వరకు సాగింది. గోరుకంటి రవీందర్‌రావు మాట్లాడుతూ మన గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అనారోగ్యకర జీవనశైలికి దూరంగా ఉండాలన్నారు. టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న మాట్లాడుతూ టీసీఎస్‌ ఉద్యోగులంతా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, రోజువారీ నడకపై దృష్టిపెట్టాలని కోరారు. యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. పవన్‌ గోరుకంటి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ భరత్‌ పురోహిత్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు