logo

పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించాలి

బీసీ కుల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేశ్వర్‌యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నింబోలిఅడ్డాలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 27 Mar 2023 03:37 IST

మాట్లాడుతున్న రాజేశ్వర్‌యాదవ్‌. చిత్రంలో బీసీ నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: బీసీ కుల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేశ్వర్‌యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నింబోలిఅడ్డాలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల సమగ్రాభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. ప్రైవేట్‌ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నియమిత పదవుల్లో ఓబీసీలకు 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నేతలు ఎం.కుమార్‌, పూసల సత్యనారాయణ, జగదీశ్‌గౌడ్‌, దిలీప్‌ ముదిరాజ్‌, సాయిబాబా, రాహుల్‌, శివ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని