logo

దేవాలయాల అభ్యున్నతికి కృషి: మంత్రి

ఆదిశక్తిని పూజించే చైత్ర నవరాత్రులు అత్యంత శక్తిమంతమైనవని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మా వైష్ణవి దేవి జాగరణ్‌ మండల్‌ ఆధ్వర్యంలో ఆదివారం గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో.

Published : 27 Mar 2023 01:32 IST

మంత్రి తలసానిని సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ఉత్సవ సమితి నేతలు

గోషామహల్‌, న్యూస్‌టుడే: ఆదిశక్తిని పూజించే చైత్ర నవరాత్రులు అత్యంత శక్తిమంతమైనవని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మా వైష్ణవి దేవి జాగరణ్‌ మండల్‌ ఆధ్వర్యంలో ఆదివారం గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో నిర్వహించిన ‘మా వైష్ణవి దేవి విశాల్‌ జాగరణ్‌‘లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాల పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని గుర్తు చేశారు. మా వైష్ణవి దేవి జాగరణ్‌ మండల్‌ ఛైర్మన్‌ అంజనీకుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ..వేలాది మంది భక్తులు పాల్గొని జాగరణ్‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూలోని మా వైష్ణో దేవిమాతా దేవాలయం పురోహితులు లోకేశ్‌ ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూలోని దేవాలయం నుంచి తీసుకువచ్చిన ప్రసాదం, నాణాలను భక్తులకు పంపిణీ చేశారు. శనివారం రాత్రి పది గంటలకు ప్రారంభమైన జాగరణ్‌ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఉత్సవ సమితి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు