logo

సామాజిక సేవలో రైస్‌ ఏటీఎంకు పురస్కారం

ప్రాజెక్టు ప్రిష పేరిట 1,950 కుటుంబాలకు జీవనోపాధి కల్పించి కరోనా కష్టకాలంలో ఆపన్నులకు ఆసరాగా నిలిచినందుకు సామాజిక సేవకుడు దోసపాటి రాముకు తెలుగు సినిమా వేదిక ఉగాది జీవన సాఫల్య  జాతీయ పురస్కారాన్ని అందించింది.

Updated : 27 Mar 2023 04:11 IST

ఆర్‌. నారాయణమూర్తి, అనిల్‌ కుమార్‌ నుంచి అవార్డు అందుకుంటున్న దోసపాటి రాము

నాగోలు, న్యూస్‌టుడే: రైస్‌ ఏటీఎం ద్వారా లక్ష మందికి పైగా భోజన వసతి, ప్రాజెక్టు ప్రిష పేరిట 1,950 కుటుంబాలకు జీవనోపాధి కల్పించి కరోనా కష్టకాలంలో ఆపన్నులకు ఆసరాగా నిలిచినందుకు సామాజిక సేవకుడు దోసపాటి రాముకు తెలుగు సినిమా వేదిక ఉగాది జీవన సాఫల్య  జాతీయ పురస్కారాన్ని అందించింది. నగరంలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, దర్శకులు, నటులు ఆర్‌.నారాయణమూర్తి, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్‌ అనిల్‌కుమార్‌ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని