logo

‘నిద్రలేమితో అనారోగ్య సమస్యలు’

నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని భారత నిద్రా వైద్య పితామహుడు డా.జేసీ సూరి అన్నారు. నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో నిద్ర రుగ్మతల వైద్య విభాగాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు.

Published : 27 Mar 2023 01:32 IST

నిద్ర రుగ్మతల వైద్య విభాగాన్ని ప్రారంభిస్తున్న డా.జేసీ సూరి, డా.గురునాథ్‌రెడ్డి, డా.నళిన

రాయదుర్గం, న్యూస్‌టుడే: నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని భారత నిద్రా వైద్య పితామహుడు డా.జేసీ సూరి అన్నారు. నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో నిద్ర రుగ్మతల వైద్య విభాగాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. మనిషికి తగినంత నిద్రలేకపోతే విశ్రాంతి లభించక అవయవాలు నియంత్రణ కోల్పోయి గుండె, శ్వాసకోశ తదితర జబ్బులకు గురవుతారని, రోగనిరోధక శక్తి తగ్గుతుందని, స్థూలకాయ సమస్యలు, రోడ్డు ప్రమాదాలూ పెరుగుతాయన్నారు. వయసు పెరిగే కొద్దీ నిద్రలేమి సమస్యలూ అధికమవుతాయని, నిద్రకు సూర్యరశ్మి దోహదం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఉదయం సూర్యకాంతిని పొందాలని, శారీరక వ్యాయామాలు, శ్రమకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాంటినెంటల్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ డా.గురునాథ్‌ రెడ్డి ప్రసంగిస్తూ భారత్‌లో నిద్ర వైద్యంపై తగిన నియంత్రణ వ్యవస్థను తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.  ఆసుపత్రి నిద్ర వైద్యం, పల్మొనాలజీ విభాగం అధిపతి డా.నళిని పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని