logo

కూలింది.. కలవరపెడుతోంది

నవాబ్‌పేట మండలం పూలపల్లి - గండ్యాడ మధ్య కల్వర్టు ఓవైపు పూర్తిగా కూలిపోయింది. పొరపాటున వాహనం వెళ్తే ప్రమాదం జరగడం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది.

Published : 27 Mar 2023 01:32 IST

ఈనాడు, వికారాబాద్‌, న్యూస్‌టుడే, నవాబ్‌పేట: నవాబ్‌పేట మండలం పూలపల్లి - గండ్యాడ మధ్య కల్వర్టు ఓవైపు పూర్తిగా కూలిపోయింది. పొరపాటున వాహనం వెళ్తే ప్రమాదం జరగడం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది. తప్పనిసరై వాహనదారులు అలాగే వెళ్తున్నారు. కనీసం ఇక్కడ సూచిక బోర్డులు కూడా లేవు. రాత్రిపూట ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు వెంటనే కల్వర్టు పునర్‌నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, తాత్కాలికంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని