యువత మత్తుమయం.. జీవితం అస్తవ్యస్తం
ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి వంటి నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల దందా ప్రస్తుతం చిన్న పట్టణాలతో పాటు జిల్లాలోని మారుమూల పల్లెలకూ పాకింది.
గ్రామాల్లో పెరుగుతున్న గంజాయి విక్రయాలు
న్యూస్‌టుడే, వికారాబాద్, తాండూరు
పరిగిలో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి వంటి నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల దందా ప్రస్తుతం చిన్న పట్టణాలతో పాటు జిల్లాలోని మారుమూల పల్లెలకూ పాకింది. గంజాయి సరఫరా చేసేవారు ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, వైద్య విద్యార్థులతో పాటు మహిళలను లక్ష్యంగా చేస్తున్నారు. వారుచెప్పినట్లు విక్రయిస్తే రూ.1500 దాకా ఇస్తున్నట్లు సమాచారం.
పట్టణ శివార్లలో..: వికారాబాద్, పరిగి, తాండూర్ పట్టణ శివార్లలో రహస్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. శివార్లలోని కళాశాల ప్రాంతాల్లో అనువుగా ఉండేలా గంజాయి వ్యాపారులు కొన్ని చోట్ల పొట్లాల రూపంలో అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల సిగరెట్లలోని పొగాకుని తీసివేసి అందులో గంజాయిని నింపి ఒక్కో సిగరెట్టు రూ.100కు అమ్ముతున్నారు.
ఇవిగో ఉదాహరణలు
* ఈ నెల 24న హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా వెళ్తున్న పూర్ణా ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తోంది. వికారాబాద్‌లో దిగిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి 25 కిలోల గంజాయిని ఆబ్కారీ, రైల్వేపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* రెండేళ్ల కిందట హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా వెళ్తున్న ముంబయి ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. దీన్లో 120 కిలోల గంజాయిని ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వాసన రాకుండా అత్తరు చల్లి తరలిస్తున్న నలుగురి ముఠాను వికారాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
* ఏడాది కిందట వికారాబాద్ పట్టణంలో సిగరెట్లలో గంజాయి నింపి విక్రయిస్తున్న ఇద్దరిని వికారాబాద్ ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేసి పదుల సంఖ్యలో సిగరెట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
పలు ఆరోగ్య సమస్యలకు కారణం
డాక్టర్ శ్రీకాంత్, ప్రభుత్వ ఆస్పత్రి, వికారాబాద్
గంజాయి దమ్ము కొట్టాక విపరీతమైన శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. గంజాయి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఊపిరితిత్తుల మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
డాక్టర్ నవీన్‌చంద్ర, జిల్లా ఆబ్కారీ అధికారి
గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్