logo

ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం: సీపీఎం

భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రజలపై భారం మోపుతున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు.

Published : 27 Mar 2023 01:32 IST

పరిగిలో మాట్లాడుతున్న జాన్‌వెస్లీ తదితరులు

పరిగి, న్యూస్‌టుడే: భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రజలపై భారం మోపుతున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోరుతూ ఆ పార్టీ చేపట్టిన జనచైనత్య యాత్ర ఆదివారం పరిగికి చేరుకుంది. గాంధీ చౌక్‌నుంచి గంజిరోడ్డు మీదుగా బస్టాండు వరకు ద్విచక్ర వాహన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో  ఆశన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, చంద్రయ్య, బుగ్గప్ప, హబీబ్‌, శేఖర్‌, రఘురాం ఉన్నారు.

వికారాబాద్‌ మున్సిపాలిటీ: కేంద్ర విధానాలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వేస్లీ, టి.సాగర్‌, ఆర్‌.వెంకట్‌రాములు అన్నారు. ఆదివారం సీపీఎం జన చైతన్య యాత్రలో భాగంగా కొత్తగడి నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో అనంత పద్మనాభ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఎంటీఎస్‌ రైలును లింగంపల్లి నుంచి తాండూరు వరకు పొడిగించాలన్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అధ్యక్షత వహించారు. రాష్ట్ర, జిల్లా నాయకులు రమ, విజయలక్ష్మీ పండిత్‌, మహిపాల్‌, శ్రీనివాస్‌, బుగ్గప్ప, సుదర్శన్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మోమిన్‌పేట: ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నేరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న జనచైతన్య యాత్ర మోమిన్‌పేటకు ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా పాత బస్‌స్డాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు కేవీపీఎస్‌ నాయకులు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని