logo

విత్తన పరిశ్రమపై కేసు

ఓ పరిశ్రమ పొందిన పేటెంట్‌ హక్కులతో అమ్మకం చేస్తున్న మరో విత్తనాల పరిశ్రమపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 28 Mar 2023 02:28 IST

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ పరిశ్రమ పొందిన పేటెంట్‌ హక్కులతో అమ్మకం చేస్తున్న మరో విత్తనాల పరిశ్రమపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లిలోని నూజివీడు విత్తన పరిశ్రమ మొక్కజొన్న విత్తనాలకు పేటెంట్‌ హక్కులు పొందింది. ఈ విత్తనాలను యాగంటి అగ్రిటెక్‌ విత్తన పరిశ్రమ లేబుల్‌ మార్చి విక్రయిస్తోంది. నూజివీడు విత్తన పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్‌ ఆధ్వర్యంలో బండమైలారంలోని సదరు సంస్థ గోదాంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ల్యాప్‌టాప్‌, రికార్డులు, విత్తనాలు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని