logo

శిశువిహార్‌లో 3 నెలల బాలిక మృతి

యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ స్టేట్‌ హోం ఆవరణలోని శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న 3 నెలల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. ఎస్సార్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 28 Mar 2023 02:37 IST

అమీర్‌పేట,న్యూస్‌టుడే: యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ స్టేట్‌ హోం ఆవరణలోని శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న 3 నెలల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. ఎస్సార్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబరు 15న ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పేదరికం కారణంగా ఆ బిడ్డను సూర్యాపేటలోని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించింది. అదే ఏడాది డిసెంబరు 23న శిశువును యూసుఫ్‌గూడలో శిశువిహార్‌కు తరలించారు. అధికారులు బాలికకు మహిక అనే పేరుపెట్టారు. తరచూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం ఈనెల 24న నీలోఫర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు