ప్రేమ విఫలం, అప్పుల బాధ.. యువకుడి ఆత్మహత్య
ఓ వైపు ప్రేమ విఫలమవడం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, ఎస్సై ఎస్.బ్రహ్మచారి కథనం ప్రకారం..
నాంపల్లి, న్యూస్‌టుడే: ఓ వైపు ప్రేమ విఫలమవడం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, ఎస్సై ఎస్.బ్రహ్మచారి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన మోటూరి సాయిప్రసాద్ (24) ఊర్లో ఓ యువతిని ప్రేమించగా.. ఆ ప్రేమ విఫలమైంది. మరోవైపు అందినకాడికి అప్పులు చేశాడు. అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిడి పెరగడంతో కొంతకాలం క్రితమే నగరానికి వలస వచ్చి నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఆండాళమ్మ బస్తీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అబిడ్స్‌లోని ఓ హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. హాస్టల్‌లో డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆదివారం సాయంత్రం నిర్వాహకులు వచ్చి చూడగా.. అప్పటికే ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. సోమవారం ఉస్మానియా మార్చురీలో మరణోత్తర పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!