logo

చిన్న వ్యాపారులకు అగ్నిమాపక అనుమతి తప్పనిసరి

అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా చిన్న వ్యాపారులు సైతం అగ్నిమాపక శాఖ అనుమతి పత్రం పొందాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.

Published : 28 Mar 2023 02:37 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా చిన్న వ్యాపారులు సైతం అగ్నిమాపక శాఖ అనుమతి పత్రం పొందాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. వంద చదరపు మీటర్ల లోపు విస్తీర్ణంలో వ్యాపారం నిర్వహించే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. దుకాణాల నిర్వాహకులు, అద్దెకు ఇచ్చే భవనాల యజమానులు ఈ పత్రం పొందాలని సూచించింది. https://firesafety.ghmc.gov.in/  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం జాబితాలోని సంస్థ వచ్చి మంటలార్పే పరికరాన్ని అమర్చి, ఆ విషయాన్ని అంతర్జాలంలో నమోదు చేశాక ధ్రువీకరణ పత్రం జారీ అవుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని