logo

ఎర్రగడ్డలో 90 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏజీకాలనీ-ఎర్రగడ్డ లక్ష్మీ కాంప్లెక్స్‌ మీదుగా  నాలా పునర్నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఎర్రగడ్డలో 90 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌) నారాయణ్‌ నాయక్‌ తెలిపారు.

Published : 28 Mar 2023 02:37 IST

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఏజీకాలనీ-ఎర్రగడ్డ లక్ష్మీ కాంప్లెక్స్‌ మీదుగా  నాలా పునర్నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఎర్రగడ్డలో 90 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌) నారాయణ్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం నుంచి జూన్‌ 28వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.  
కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలు.. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ దాటిన తరువాత మెట్రో మాల్‌ ఎదురుగా యూటర్న్‌ తీసుకుని అక్కడి నుంచి ఎడమవైపు ఉన్న ఐడీఎల్‌ లేక్‌ రోడ్డు మీదుగా గ్రీన్‌హిల్స్‌ రోడ్‌, రెయిన్‌బో విస్టాస్‌, ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్‌, పర్వత్‌నగర్‌ తాడీ కాంపౌడ్‌ నుంచి ఎడమకు తిరిగి కావూరిహిల్స్‌-నీరూస్‌ జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ఎడమ మలుపు తిరిగి యూసుఫ్‌గూడ రోడ్డు, మైత్రీవనం మీదుగా అమీర్‌పేట చేరుకోవచ్చు.

* కూకట్‌పల్లి నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలు.. కూకట్‌పల్లి వై-జంక్షన్‌ మీదుగా బాలానగర్‌ ఫ్లైఓవర్‌-న్యూ బోయిన్‌పల్లి జంక్షన్‌ నుంచి కుడి మలుపు తిరిగి, తాడ్‌బంద్‌ నుంచి కూడి మలుపు తీసుకుని ప్యారడైజ్‌ జంక్షన్‌ మీదుగా బేగంపేట వైపు ప్రయాణించాలి.

* బాలానగర్‌ నుంచి కూకట్‌పల్లి వై-జంక్షన్‌ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చేవి.. బాలానగర్‌ ఫ్లైఓవర్‌-న్యూ బోయిన్‌పల్లి జంక్షన్‌ నుంచి కుడి మలుపు తిరిగి, తాడ్‌బంద్‌ నుంచి కుడి మలుపు తీసుకుని ప్యారడైజ్‌ జంక్షన్‌ మీదుగా బేగంపేట నుంచి అమీర్‌పేటకు ప్రయాణించాలి.

* మూసాపేట-గూడ్స్‌షెడ్‌ నుంచి అమీర్‌పేట వైపు వచ్చేవి.. మూసాపేట తరువాత ఐడీఎల్‌ లేక్‌ రోడ్డు మీదుగా గ్రీన్‌హిల్స్‌ రోడ్‌, రెయిన్‌బో విస్టాస్‌, ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్‌, పర్వత్‌నగర్‌ తాడీ కాంపౌడ్‌ నుంచి ఎడమకు తిరిగి కావూరిహిల్స్‌-నీరూస్‌ జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ నుంచి ఎడమ మలుపు తిరిగి యూసుఫ్‌గూడ రోడ్డు, మైత్రీవనం మీదుగా చేరుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు