logo

తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు

తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ అన్నారు. సోమవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు...

Published : 28 Mar 2023 02:49 IST

మాట్లాడుతున్న గౌరీశంకర్‌. చిత్రంలో శ్రీమణి, నిర్మల, కళా జనార్దనమూర్తి, శ్రీలక్ష్మి

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ అన్నారు. సోమవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన సామాజిక కవి దున్న ఇద్దాసు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. 19వ శతాబ్దానికి చెందిన ఇద్దాసు తత్వ గీతాలతో దళితుల వేదన, అగ్రవర్ణాల దురహంకారంపై నిరసన తెలిపారన్నారు. సమాజాన్ని సంస్కరించే దిశగా తన గీతాలతో ప్రచారం చేశారన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తోట శ్రీలక్ష్మి, ఆత్మీయ నిర్మల, శ్రీమణి, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని