logo

రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా సంకల్ప సత్యాగ్రహం

రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంకల్ప సత్యాగ్రహం నిర్వహించారు. మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 28 Mar 2023 02:49 IST

దీక్షలో అంజన్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నాయకులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంకల్ప సత్యాగ్రహం నిర్వహించారు. మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి, యువజన కాంగ్రెస్‌ నేత అనిల్‌కుమార్‌యాదవ్‌, సిటీ వైస్‌ప్రెసిడెంట్‌ డి.నాగేందర్‌రాజు, సీనియర్‌ నాయకులు ఫిరోజ్‌ఖాన్‌లతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దారుణంగా ఉందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్ర నాయకుడిపై అనర్హత విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్‌ దేశం జరిగిన సంఘటనను గమనిస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాహుల్‌ వ్యాఖ్యల విషయంలో కోర్టు అప్పీలుకు అవకాశం ఇచ్చినా కేంద్రం ఈ రకమైన వైఖరి అవలంబించడం సరికాదన్నారు. టీపీసీసీ కార్యదర్శి విఠల్‌, మర్రి ఆదిత్యరెడ్డి, నాయకులు శివకుమార్‌, కవిత, తోట మణిమాల, చిరంజీవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని