logo

ఆలయ నిర్మాణానికి సమైక్య సహకారం: ఎమ్మెల్యే

రాకంచర్లలో ప్రసిద్ధిగాంచిన శ్రీయోగానంద లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ పునర్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కోరారు.

Published : 28 Mar 2023 02:49 IST

పనులు ప్రారంభిస్తున్న మహేశ్‌రెడ్డి, ఆలయ ఛైర్మన్‌ నర్సింహ, సర్పంచి కమిలీబాయి తదితరులు

పూడూరు, న్యూస్‌టుడే: రాకంచర్లలో ప్రసిద్ధిగాంచిన శ్రీయోగానంద లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ పునర్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కోరారు. రూ.50 లక్షల వ్యయంతో సోమవారం ఆలయ ఛైర్మన్‌ నర్సింహ, స్థానిక సర్పంచి కమిలీబాయిలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అందరి సహకారం ఉంటేనే ఆలయం పురోగతి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల, ఈఓ నరేందర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు యాదయ్య, రాంగోపాల్‌, నర్సిములు, చాందిబాయి, పీఠాధిపతి వెంకటదాసు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.  

* కార్గో ద్వారా సీతారాముల తలంబ్రాలు: కార్గో పార్సిల్‌ ద్వారా భద్రాచాలం సీతారాముల తలంబ్రాలు అందించేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దీనికి చెందిన ప్రచార గోడ పత్రికలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చేతుల మీదుగా రాకంచర్లలో ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని