logo

శ్రీరాముడి శోభాయాత్రకు గట్టి బందోబస్తు

శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు సహకరించాలని నగర పోలీసు కమిషనరు సీవీ ఆనంద్‌ కోరారు.

Published : 28 Mar 2023 03:09 IST

సీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తో ఉత్సవ సమితి నేతలు  

ధూల్‌పేట, సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు సహకరించాలని నగర పోలీసు కమిషనరు సీవీ ఆనంద్‌ కోరారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనరు లోకేశ్‌కుమార్‌, శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డా.భగవంత్‌రావు వివిధ శాఖల అధికారులతో కలిసి మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్‌ ద్రౌపదీ గార్డెన్స్‌లో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం   సీపీ సీవీ ఆనంద్‌, డీసీపీలు జోయల్‌ డేవిస్‌, కిరణ్‌ ఖరేతోపాటు ఉత్సవ సమితి ప్రతినిధులు డా.భగవంత్‌రావు, గోవింద్‌రాఠీ, కార్పొరేటర్లు శంకర్‌యాదవ్‌, డా.సురేఖ ఓంప్రకాశ్‌ తదితరులు ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. అదనపు సీపీలు విక్రమ్‌సింగ్‌ మాన్‌, సుధీర్‌బాబు, జాయింట్‌ సీపీలు శ్రీనివాసులు, విశ్వప్రసాద్‌, ఏసీపీ సతీశ్‌కుమార్‌, సీఐలు నునావత్‌ రవి, అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

అంబర్‌పేట, న్యూస్‌టుడే: ఈ నెల 30న అంబర్‌పేట మున్సిపల్‌ మైదానం నుంచి సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు చేపట్టనున్న శ్రీరామ నవమి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని పోలీస్‌ తూర్పు మండలం డీసీపీ సునీల్‌దత్‌ కోరారు. సోమవారం అంబర్‌పేటలో శోభాయాత్ర మార్గాన్ని శ్రీరామ నవమి ఉత్సవ సమితి కన్వీనర్‌, నిర్వాహకుడు వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. నేతలు బుచ్చిరెడ్డి, ఆనంద్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, మైలారం రాజు పాల్గొన్నారు.

యాత్ర మార్గాన్ని పరిశీలిస్తున్న డీసీపీ సునీల్‌దత్‌, వెంకట్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌ తదితరులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు