రూ.752.79 కోట్లతో ఓయూ బడ్జెట్
ఉస్మానియా యూనివర్సిటీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు. ఓయూ మొత్తం ఆదాయం రూ.685.79 కోట్లు, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.24.36 కోట్లు..
బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రొ.ఆర్.నాగేశ్వర్‌రావు
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు. ఓయూ మొత్తం ఆదాయం రూ.685.79 కోట్లు, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.24.36 కోట్లు.. వ్యయం రూ.752.79 కోట్లు, లోటు రూ.42.64 కోట్లుగా చూపారు. ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ రూ.457.10 కోట్లు, మిగిలిన నిధులను యూనివర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకోనుంది. ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్‌లో ఉపకులపతి ప్రొ.రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొ.మురళీకృష్ణ వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన ప్రొ.ఆర్.నాగేశ్వర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
రూపాయి రాక.. బడ్జెట్ మొత్తం రూ.752.79 కోట్లలో లోటు 5.66శాతం (రూ.42.64 కోట్లు). ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్ 60.72శాతం (రూ.457.10 కోట్లు). గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ 3.23శాతం (రూ.24.36 కోట్లు). వివిధ గ్రాంట్ల రూపేణా ప్రభుత్వం నుంచి 7.30 శాతం (రూ. 55.00 కోటు)్ల మంజూరైంది. మిగిలిన 23.07శాతం (రూ.173.69 కోట్ల) నిధులను యూనివర్సిటీ భరించాల్సిఉంది. ఇందులో అంతర్గత ఆదాయాల ద్వారా రూ.36.45 కోట్లు, ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఫారన్ రిలేషన్స్ ఆఫీస్, పీజీఆర్‌ఆర్‌సీడీఈ తదితరాల ద్వారా రూ.134.54 కోట్లు, వివిధ రకాల రుణాలు, అవార్డుల వసూళ్లు వాటి ద్వారా రూ.2.70 కోట్లు సమకూర్చుకుంటామని తెలిపారు. మొత్తం బడ్జెట్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు దాదాపు 94.23 శాతం నిధులు కేటాయించారు.
రూపాయి పోక.. మొత్తం రూ.752.79 కోట్ల యూనివర్సిటీ మొత్తం బడ్జెట్‌లో ఉద్యోగుల వేతనాలకు 55.31 శాతం (రూ.416.33 కోట్లు), పెన్షన్లకు 38.92 శాతం (రూ. 293.00కోట్లు) కేటాయించారు. కాంటింజెన్సీకి 5.41శాతం (రూ.40.76కోట్లు), ఉద్యోగుల లోన్లకు 0.36శాతం (రూ.2.70కోట్లు) కేటాయించారు.
ప్రభుత్వం సహకరిస్తోంది..
- ప్రొ.రవీందర్, ఓయూ ఉపకులపతి
ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో లోటు రూ.42.64 కోట్లుగా ఉంది. ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశాం. యూనివర్సిటీని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరతాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ