logo

చూసొద్దాం.. సీతాకోకల వనం

కేపీహెచ్‌బీ ఐదో ఫేజ్‌లో సీతాకోక చిలుకల ఉద్యానం సిద్ధమైంది. నగరవ్యాప్తంగా రూ.123కోట్లతో చేపట్టిన 57 థీమ్‌ పార్కుల అభివృద్ధిలో భాగంగా ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 03:19 IST

కేపీహెచ్‌బీ ఐదో ఫేజ్‌లో సీతాకోక చిలుకల ఉద్యానం సిద్ధమైంది. నగరవ్యాప్తంగా రూ.123కోట్లతో చేపట్టిన 57 థీమ్‌ పార్కుల అభివృద్ధిలో భాగంగా ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉద్యానంలో సీతాకోక చిలుకల రంగు బొమ్మలు, కుర్చీలపై వేసిన చిత్రాలను ఆమె ట్విట్టర్‌లో ఉంచారు. ఉద్యానాన్ని 560చ.మీ విస్తీర్ణంలో రూ.10.81లక్షలతో అభివృద్ధి చేశారు. పార్కు చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం, అడవి వాతావరణం ఉంటుంది. సీతాకోకచిలుకలకు ఇష్టమైన ఇగ్జోరా, లావెండర్‌, చైనాబాక్స్‌, వింకారోజియా, లాంటేనా కెమెరా (పులికంప), టెకిమా కెపిన్సిస్‌, కదంబ, పైసోవియా ఆల్బా, గోవర్దనగిరి, పైకాస్‌మాల్టిహెడ్‌ వంటి మొక్కలను పార్కులో నాటారు. కుర్చీలు, సెల్ఫీ స్పాట్‌ను, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు