logo

తెదేపా ఆవిర్భావ సభకు ముమ్మర ఏర్పాట్లు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు.

Published : 29 Mar 2023 02:21 IST

ఎగ్జిబిషన్‌ మైదానంలో భారీ కటౌట్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో కమిటీల ప్రతినిధులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగే ఈ సభలో తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం లోపల, బయట అటుగా వెళ్లే రోడ్లపై భారీ ఎత్తున కటౌట్లు వెలిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని