logo

దుంప పంటల సాగుకు నేలలు అనుకూలం

చేమగడ్డ, మొరంగడ్డ సాగుకు ఈ ప్రాంత నేలలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ సురేశ్‌ అన్నారు.

Published : 29 Mar 2023 02:21 IST

కొత్త రకం మొరం గడ్డ మొలకలతో మహిళా రైతులు

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: చేమగడ్డ, మొరంగడ్డ సాగుకు ఈ ప్రాంత నేలలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ సురేశ్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, పట్టు పరిశ్రమ శాఖ, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద మహిళా రైతులకు దుంప పంటలపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుంపల సాగుకు అత్వెల్లి, కొంపల్లి, మదన్‌పల్లి, ఎర్రవల్లి, పులుమద్ది గ్రామ భూములు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. వరికి ప్రత్యామ్నాయంగా దుంప పంటల సాగు లాభదాయకంగా ఉంటుందన్నారు. మరో శాస్త్రవేత్త లావణ్య మాట్లాడుతూ దుంపలకు మార్కెట్‌లో సరియైన ధర లేనప్పుడు చిప్స్‌, పిండి పదార్థాలను తయారు చేయవచ్చని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త రకం చేమగడ్డ విత్తనాలు, మొరంగడ్డ మొలకలను పంపిణీ చేశారు. ఉద్యాన అధికారులు కమల, వైజయంతి, అర్చన, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని