logo

శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

శ్రీరామ నవమిని పురస్కరించుకొని భాగ్యనగరంలో నిర్వహించే భవ్య శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డా.భగవంత్‌రావు కోరారు.

Published : 29 Mar 2023 02:21 IST

ప్రసంగిస్తున్న డా.భగవంత్‌రావు, చిత్రంలో గోవింద్‌రాఠీ, శ్రీరామ్‌వ్యాస్‌, కరోడిమల్‌ తదితరులు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: శ్రీరామ నవమిని పురస్కరించుకొని భాగ్యనగరంలో నిర్వహించే భవ్య శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డా.భగవంత్‌రావు కోరారు. ఈ మేరకు సిద్దింబర్‌బజార్‌లోని బాహెతీభవన్‌లో గల ఉత్సవ సమితి కార్యాలయంలో నేతలు గోవింద్‌రాఠీ, శ్రీరామ్‌వ్యాస్‌, కరోడిమల్‌, మెట్టు వైకుంఠం, బాబూగురు తదితరులతో కల్సి ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న చారిత్రక సీతారాంబాగ్‌ ఆలయంలో ద్రౌపదీ గార్డెన్స్‌ నుంచి శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై హనుమాన్‌ వ్యాయామశాలకు రాత్రి 7కు చేరుకుంటుందన్నారు.

రేపు మద్యం దుకాణాలు బంద్‌

నేరేడ్‌మెట్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకొని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గురువారం మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ డీఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని