logo

‘దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న కేంద్రం’

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తెలిపారు.

Published : 29 Mar 2023 02:21 IST

నినాదాలు చేస్తున్న శివమ్మ, నందగోపాల్‌, వెంకటేశ్‌, గుజ్జ కృష్ణ, భూపేశ్‌సాగర్‌ తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తెలిపారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించే విపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి బెదిరిస్తుందన్నారు. మంగళవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు భూపేశ్‌సాగర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల సంక్షేమం, డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో ఆందోళన చేపడుతామన్నారు. నేతలు నీలం వెంకటేశ్‌, రాము, నందగోపాల్‌, రాజ్‌కుమార్‌, శివమ్మ, నిర్మల, మహేశ్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని