logo

ఆక్రమణలపై ఉక్కుపాదం

నకిలీ భూ దస్త్రాలు సృష్టించి హెచ్‌ఎండీఏ స్థలాలను కాజేయడానికి రియల్‌ వ్యాపారులు వేసిన ఎత్తుగడలను ఉన్నతాధికారులు చిత్తు చేశారు.

Published : 29 Mar 2023 02:09 IST

ఆపరేషన్‌ శంషాబాద్‌ విజయవంతం

పొక్లెయిన్‌తో నిర్మాణాల ధ్వంసం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: నకిలీ భూ దస్త్రాలు సృష్టించి హెచ్‌ఎండీఏ స్థలాలను కాజేయడానికి రియల్‌ వ్యాపారులు వేసిన ఎత్తుగడలను ఉన్నతాధికారులు చిత్తు చేశారు. హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లో జాతీయ రహదారికి ఆనుకొని హెచ్‌ఎండీఏకు చెందిన 50 ఎకరాలపై కొంత మంది రియల్‌ వ్యాపారుల కన్నుపడింది. నకిలీ భూ దస్త్రాలు సృష్టించి దాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఈ వ్యవహారం హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఉదయం సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బెంగళూర్‌ జాతీయ రహదారి- ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులను 5 గంటల పాటు పూర్తిగా మూసివేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 6 యంత్రాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ఆపరేషన్‌లో 15 మంది హెచ్‌ఎండీఏ ఎస్టేట్‌ అధికారులు, సిబ్బంది.. 50 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ భద్రతాసిబ్బంది, 20 మంది సైబరాబాద్‌ పోలీసులు, 10 మంది క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు