logo

బాలికపై అత్యాచారం కేసులో ఇరవై ఏళ్ల జైలు

ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న పదేళ్ల చిన్నారిని భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20,000 జరిమానా విధించింది.

Published : 29 Mar 2023 02:09 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న పదేళ్ల చిన్నారిని భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20,000 జరిమానా విధించింది. దీంతో పాటు బాధితురాలికి రూ.6 లక్షలు పరిహారం మంజూరు చేస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీశ మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. ఎల్బీనగర్‌ హస్తినాపురం ప్రాంతానికి చెందిన బనబాసి నాహక్‌ అలియాస్‌ బహదూర్‌(55) ఓ ఖాళీ స్థలం వద్ద కాపలాదారుగా పనిచేసేవాడు. 2017 జనవరి 1న ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు పనికి వెళ్లగా పదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉన్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎల్బీనగర్‌ పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితుడిపై కోర్టులో పోక్సో చట్టం కింద అభియోగ పత్రం దాఖలు చేయగా.. కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని