పర్యావరణ పరిరక్షణకు విదేశీ వర్సిటీతో జేఎన్‌టీయూ ఒప్పందం
పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై జేఎన్‌టీయూ హైదరాబాద్, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.
వాటర్ సెంటర్ ఏర్పాటుపై రజత్‌కుమార్‌తో చర్చలు
రాష్ట్ర అధికారులు రజత్‌కుమార్, మురళీకృష్ణ, జేఎన్‌టీయూ ప్రొ. విజయలక్ష్మితో వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ ప్రతినిధులు లిండా టేలర్, జోడీ మెక్ కే
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, కూకట్‌పల్లి: పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై జేఎన్‌టీయూ హైదరాబాద్, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సిడ్నీ వర్సిటీ డిప్యూటీ వీసీ దెబొరా స్వీనేలు మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం రెండు వర్సిటీలు ఎన్విరాన్‌మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పీహెచ్‌డీ ప్రోగ్రాం నిర్వహిస్తాయి. అనంతరం వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ప్రతినిధులు, జేఎన్‌టీయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ సంచాలకులు డాక్టర్ టి.విజయలక్ష్మి తదితరులు సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ను కలిసి ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెంటర్(ఏఐడబ్ల్యూసీ) ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల్లోని ఇంజినీర్లకు వెస్ట్రన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, అంగీకారం రాగానే ఏర్పాటుచేస్తామని రజత్‌కుమార్ తెలిపారు. జేఎన్‌టీయూ రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, డీఏపీ డైరెక్టర్ చంద్రమోహన్, ఆర్‌అండ్‌డీ డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రవేశాల విభాగం డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, ప్రిన్సిపల్ జయలక్ష్మి, డీఏపీ డిప్యూటీ డైరెక్టర్ శ్వేత, లిండా టేలర్, ఆస్ట్రేలియా ప్రభుత్వ మాజీ మంత్రి జోడీ మెక్ కే పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్