logo

ఒక్క విదేశీ భాషలోనైనా ప్రావీణ్యం సంపాదించాలి

సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు మంగళవారం ఓయూ పరిధిలోని ఇఫ్లూ(ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) క్యాంపస్‌లో విదేశీ భాష, ఆంగ్ల తరగతులకు హాజరయ్యారు. 160 మంది విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శించారు.

Published : 29 Mar 2023 02:09 IST

ఇఫ్లూ క్యాంపస్‌లో విద్యార్థులతో అధ్యాపకులు  

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు మంగళవారం ఓయూ పరిధిలోని ఇఫ్లూ(ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) క్యాంపస్‌లో విదేశీ భాష, ఆంగ్ల తరగతులకు హాజరయ్యారు. 160 మంది విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శించారు. ఓ బ్యాచ్‌ విద్యార్థులు ఫ్రెంచ్‌ భాషా తరగతికి, మరో బ్యాచ్‌ స్పానిష్‌, ఆంగ్లభాష తరగతులకు హాజరయ్యారు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభ్యర్థనమేరకు ఇఫ్లూ ఇందిరానగర్‌ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు ఆంగ్లం, విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చినట్లు ఇఫ్లూ వీసీ ప్రొ.ఇ.సురేష్‌కుమార్‌ వివరించారు. ప్రతి ఒక్కరూ ఒక్క విదేశీ భాషలోనైనా ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. రాష్ట్ర వైద్యసంస్థ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరామ్‌, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారులు రామస్వామి, సత్యనారాయణరెడ్డి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని