రూ.వేల కోట్ల భూములు.. అభ్యంతరం లేదన్నారు
ఐటీ కారిడార్‌కు చిరునామాగా మారిన ఖాజాగూడలోని ప్రభుత్వ భూములపై ఆక్రమణ దారులు కన్నేశారు.
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, రాయదుర్గం: ఐటీ కారిడార్‌కు చిరునామాగా మారిన ఖాజాగూడలోని ప్రభుత్వ భూములపై ఆక్రమణ దారులు కన్నేశారు. రూ.2వేల కోట్లకుపైగా విలువైన 27 ఎకరాల స్థలాన్ని కబళించేందుకు పక్కాగా కార్యాచరణ రూపొందించారు. పై స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు.. అభ్యంతరం లేదన్నారు. ఇంకేముంది.. తమకు నిరభ్యంతర పత్రాలు వచ్చాయని రెండుమూడు రోజుల నుంచి కంచెలు వేసి రేకుల షెడ్లు ఏర్పాటుచేస్తున్నారు.. స్థానికులు ఫిర్యాదు చేయగా.. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు వాటిని తొలగించారు. సోమవారం రాత్రి.. మరోవైపు నుంచి ఆక్రమణదారులు చిన్నగా కంచె వేయడంమొదలుపెట్టారు.
తప్పుడు రికార్డులంటూ ధ్రువీకరణ
ఖాజాగూడ గ్రామం సర్వే నంబరు 27లో 27ఎకరాల 18గుంటల స్థలంపై అరవై ఏళ్ల నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. 2007లో హైకోర్టు ఆదేశాలతో ఆ వివాదాలు ఆగిపోయాయి. సర్వే నంబరు 27లో భూములు మావేనంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు 1963లో అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేయగా.. డీఆర్‌వో భూములు వారివేనన్నారు. మరికొందరు ప్రైవేటు వ్యక్తులు మావేనంటూ పహణీ రికార్డులు సమర్పించగా.. వారివేనని రెవెన్యూ అధికారులు అంగీకరించారు. తొలుత తమవేనంటూ చెప్పిన ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల సర్వేల ప్రకారం సదరు 27ఎకరాల 18గుంటల భూమి ప్రభుత్వానిదేననంటూ వ్యాజ్యాలన్నింటినీ 2007లో హైకోర్టు కొట్టేసింది. అక్రమార్కులు మళ్లీ కబ్జాలకు తెరతీయగా. నాలుగేళ్ల కిందట స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనగర్ ఆర్డీవో విచారణకు ఆదేశించారు. శేరిలింగంపల్లి తహసీల్దారు విచారణ జరిపి ప్రభుత్వ భూములేనని నివేదిక ఇచ్చారు. తాజాగా అక్రమార్కులు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ భూముల విలువ ఎకరా సుమారు రూ.80కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!