logo

బాంబు వదంతుల కలకలం!

శ్రీరామనవమి ఊరేగింపు వేళ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ మంగళవారం రాత్రి ఒక లేఖ కలకలం సృష్టించింది.

Published : 29 Mar 2023 02:09 IST

నకిలీ లేఖగా తేల్చిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనవమి ఊరేగింపు వేళ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ మంగళవారం రాత్రి ఒక లేఖ కలకలం సృష్టించింది. ఈ నెల 31న నగరంలోని పలు ప్రాంతాల్లో దేవాలయాలు, పార్టీ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా ఉగ్ర దాడికి కుట్ర పన్నుతున్నారనేది లేఖలోని సారాంశం. మండిమీరాలం ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా ఉన్న వినతిపత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి..ఆ లేఖ నకిలీదిగా తేల్చారు. దిల్లీకు చెందిన ఒక మహిళ తమ బంధువులపై కోపంతో అసత్య ప్రచారానికి పాల్పడినట్లు ధ్రువీకరించారు. లేఖలో పేర్కొన్న ఇద్దరు ఉద్యోగులు ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు, వారిద్దరికీ అసాంఘిక శక్తులతో సంబంధాల్లేవని నిర్ధారించారు. కేవలం వారిపై కక్షతోనే గతంలో రాధికా రంగ్వాల్‌, ప్రస్తుతం ఉమామహేశ్వరి పేర్లతో నకిలీ లేఖను సృష్టించినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని