logo

సమాచారం ఎలా వచ్చింది? ఎవరెవరికి ఇచ్చారు?

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన 16.8 కోట్ల మంది డేటా చౌర్యం కేసులో అరెస్టయిన నిందితుల్ని సైబరాబాద్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

Published : 29 Mar 2023 02:09 IST

డేటా చౌర్యం కేసులో నిందితుల తొలిరోజు కస్టడీ

ఈనాడు - హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన 16.8 కోట్ల మంది డేటా చౌర్యం కేసులో అరెస్టయిన నిందితుల్ని సైబరాబాద్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసు విచారణకు అంతర్గతంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆధ్వర్యంలో నిందితుల్ని విచారిస్తున్నారు. తొలిరోజు కస్టడీలో భాగంగా మొత్తం ఐదుగుర్ని కలిపి విచారించినట్లు తెలిసింది. ప్రధానంగా కోట్లాది మంది సమాచారం ఎలా సేకరించారు? దాన్ని ఎవరెవరికి విక్రయించారు? అనే అంశం చుట్టూనే ప్రశ్నించినట్లు సమాచారం. ‘డేటా ఎండ్‌ పాయింట్‌’(సమాచారం రావడానికి మూలం) ఎక్కడుందనే అంశంపై ఎక్కువగా దృష్టిసారించారు. నిందితుల్లో ఒకడైన జియా ఉల్‌ రెహ్మాన్‌ నుంచి మిగిలిన వ్యక్తులకు గంపగుత్తగా డేటా అందింది. రెహ్మాన్‌ ముంబయికి చెందిన ఒక వ్యక్తి నుంచి సమాచారం కొన్నాడు. ఈ నేపథ్యంలో రెహ్మాన్‌ ఇప్పటికే అరెస్టయిన నిందితులకు కాకుండా.. గంపగుత్తగా ఎవరెవరికి ఇచ్చాడనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా అత్యంత సున్నితమైన, జాతీయ భద్రతతో ముడిపడ్డ రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం బయటకు రావడంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని