logo

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తవ్వకాలు జరుపుతున్న 9 మందిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 29 Mar 2023 02:09 IST

తొమ్మిది మంది అరెస్టు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తవ్వకాలు జరుపుతున్న 9 మందిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల మేరకు.... మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌కు చెందిన వినోద్‌(32) రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్లో నివసించే తన తాత అయిన విశ్రాంత ఉద్యోగి నాగులుయాదవ్‌ ఇంటికి వచ్చాడు. నాగులు యాదవ్‌ ఇల్లు బుద్వేల్లోని ఓ పురాతన కోటగోడకు ఆనుకుని ఉండటంతో ఆ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని వినోద్‌ భావించాడు.  ఆదివారం రాత్రి ఇంట్లో తవ్వకాలు ప్రారంభించారు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకొని తవ్వకాలు జరిపిస్తున్న వినోద్‌తో పాటు మొయినాబాద్‌కు చెందిన విశ్వంత్‌, హరిప్రీత్‌సింగ్‌, శివసాయి, బషీర్‌బాగ్‌కు చెందిన అస్లం, దోమలగూడకు చెందిన దివ్యానా, ఫలక్‌నుమాకు చెందిన ఖాదర్‌ఖాన్‌, మురళీకృష్ణ, ఎర్రమంజిల్‌కు చెందిన కృష్ణమోహన్‌ తదితరులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని