మళ్లీ కబ్జా.. మైసమ్మ చెరువు మాయమిక!
మూసాపేట గ్రామ పరిధిలోని మైసమ్మ చెరువును కబ్జాదారులు ముంచేస్తున్నారు. గతంలో నకిలీ సమాధులను నిర్మించి కబ్జాకు యత్నించిన ఉదంతంపై ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించగా.. జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని తొలగించి ఆక్రమణ అడ్డుకున్నారు.
మైసమ్మచెరువు దోభీఘాట్ వెనుక చెరువును మట్టితో పూడ్చిన దృశ్యం
ఈనాడు, హైదరాబాద్: మూసాపేట గ్రామ పరిధిలోని మైసమ్మ చెరువును కబ్జాదారులు ముంచేస్తున్నారు. గతంలో నకిలీ సమాధులను నిర్మించి కబ్జాకు యత్నించిన ఉదంతంపై ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించగా.. జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని తొలగించి ఆక్రమణ అడ్డుకున్నారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న ఆక్రమణదారు తాజాగా మళ్లీ కబ్జా పర్వాన్ని ప్రారంభించారు. శ్మశానవాటిక పక్కనున్న భూమితోపాటు.. దోభీఘాట్ వెనుకనున్న ఎఫ్‌టీఎల్(పూర్తిస్థాయి నీటి మట్టం) స్థలానికీ ఎసరు పెట్టారు. మూసాపేట ఐడీఎల్ భూముల పక్కన భారీ భవంతుల నిర్మాణ పనులు జరుగుతుండగా, అక్కడ ఉత్పత్తవుతున్న సెల్లారు మట్టి, బండరాళ్లను చెరువు కబ్జాకు వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు భారీ ట్రక్కులతో టన్నుల కొద్దీ మట్టిని చెరువులో వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ చెరువుల సంరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటుండగా, మంత్రి లక్ష్యానికి గండికొట్టేలా ఆక్రమణదారు మైసమ్మ చెరువును మాయం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి దన్ను ఉండటంతో, కబ్జాను అడ్డుకునేందుకు యత్నించే అధికారులపై ఆక్రమణదారు బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP-Adani Group: షిర్డీ సాయికే.. స్మార్ట్‌గా ఇచ్చేశారు.. ఇదో భారీ కుంభకోణం
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!