logo

విమానాశ్రయంలో 3.175 కిలోల బంగారం పట్టివేత

విదేశాల నుంచి బంగారం అక్రమంగా తరలించడానికి స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. భద్రతాధికారులకు అనుమానం రాకుండా విదేశీ మహిళల ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొస్తున్నారు

Published : 30 Mar 2023 02:04 IST

నలుగురు విదేశీ మహిళల అరెస్టు

బంగారం క్యాప్సుల్స్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: విదేశాల నుంచి బంగారం అక్రమంగా తరలించడానికి స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. భద్రతాధికారులకు అనుమానం రాకుండా విదేశీ మహిళల ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొస్తున్నారు. తాజాగా బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో నలుగురు విదేశీ మహిళల మలద్వారాలలో 3.175కిలోల బంగారం దొరకడంతో అధికారులు విస్తుపోయారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూడాన్‌ దేశానికి చెందిన నలుగురు మహిళలు సందర్శన, పర్యాటక వీసాలతో దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో రూ.1.94 కోట్ల విలువైన బంగారాన్ని క్యాప్సుల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకొని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో వారి ప్రవర్తనపై అధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ బంగారం తరలింపు గుట్టురట్టయింది. మహిళలను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని