logo

డేటా చౌర్యం కేసు.. కొనసాగిన కస్టడీ

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన 16.8 కోట్ల మంది డేటాచౌర్యం కేసులో అరెస్టయిన నిందితుల కస్టడీ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఈ గ్యాంగ్‌ తరహాలో ఎన్ని ముఠాలు పనిచేస్తున్నాయనే కోణంలో విచారించినట్లు తెలిసింది. దేశంలో ఎక్కడెక్కడ ఈ ముఠాలున్నాయి..?

Published : 30 Mar 2023 02:04 IST

ఈనాడు- హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన 16.8 కోట్ల మంది డేటాచౌర్యం కేసులో అరెస్టయిన నిందితుల కస్టడీ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఈ గ్యాంగ్‌ తరహాలో ఎన్ని ముఠాలు పనిచేస్తున్నాయనే కోణంలో విచారించినట్లు తెలిసింది. దేశంలో ఎక్కడెక్కడ ఈ ముఠాలున్నాయి..? సమాచారం ఎవరెవరికి ఎలా విక్రయిస్తున్నారు..? ఎలా పనిచేస్తున్నాయనే సమాచారం రాబడుతున్నారు. పోలీసుల ప్రశ్నలకు నిందితులు పైపైన సమాధానాలు ఇస్తున్నారని, నోరువిప్పడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రాథమిక సమాచారం మాత్రమే వచ్చిందని మరింత విచారిస్తేనే ఈ ముఠాల వెనుక గుట్టు బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని