logo

‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ సర్కార్‌’

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:27 IST

కాగడాల ప్రదర్శనలో మోత రోహిత్‌, యువజన కాంగ్రెస్‌ నేతలు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ అన్నారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే డిమాండ్‌తో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి విశాల్‌ మార్ట్‌ నుంచి అంబర్‌పేట ముత్యాలమ్మ ఆలయం వరకు చేపట్టిన కాగడాల ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అక్రమాలను పార్లమెంటులో ప్రశ్నించినందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగా కుట్రపూరితంగా రాహుల్‌గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. ప్రభుత్వ గృహం నుంచి ఖాళీ చేయాలంటూ నోటీసును జారీ చేయడం మోదీ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. నేతలు రాకేశ్‌యాదవ్‌, సాయిబాబా, ఉదయ్‌భాస్కర్‌, వెంకట్‌, కిశోర్‌యాదవ్‌, ప్రియాంక, హాజీఅలీ, మోయిజ్‌, అరవింద్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు