మహిళా మహోత్సవాలకు విశేష స్పందన
మహిళా మహోత్సవాల సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది.
రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి
ఫిల్మ్‌సిటీలో వినోద కార్యక్రమాన్ని తిలకిస్తున్న పర్యాటకులు
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే : మహిళా మహోత్సవాల సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. మార్చి 1 నుంచి 31 వరకు ఏర్పాటుచేసిన మహిళా మాసోత్సవాల్లో అన్ని వర్గాల మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ మహిళలు భారీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొంటున్నారు. స్టూడియో టూర్, ప్రత్యేక ప్రదర్శనలు, స్టంట్ షోలు, సరదా రైడ్‌లు, పక్షుల పార్కు, సీతాకోక చిలుకల పార్కు సందర్శన, ఉద్యానాల్లో విహారంతో అద్వితీయ అనుభూతి పొందుతున్నారు. ప్రత్యేక వినోద కార్యక్రమాలను వీక్షిస్తూ, రామోజీ అడ్వెంచర్ సాహస్‌లోని కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారు. టాలెంట్ హంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తుండటంతో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ ఆన్‌లైన్ ద్వారా ప్రవేశ టికెట్‌ను కొనుగోలు చేస్తే ఇద్దరు మహిళలకు ప్రవేశం కల్పించడంతో మంచి ఆదరణ లభించింది. 31వ తేదీ వరకు వేడుకల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్