logo

వైద్యులపై దాడులు సరికాదు

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో వైద్యులపై దాడులు జరుగుతున్నాయని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.శరద్‌కుమార్‌ అగర్వాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు

Updated : 30 Mar 2023 04:16 IST

మిక్సోపతికి వ్యతిరేకం: ఐఎంఏ

మాట్లాడుతున్న ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డా.శరద్‌కుమార్‌ అగర్వాల్‌

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో వైద్యులపై దాడులు జరుగుతున్నాయని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.శరద్‌కుమార్‌ అగర్వాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులపై దాడులను అరికట్టడంతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులను ‘సేఫ్‌ జోన్‌’గా ప్రకటించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌, కోఠిలోని ఐఎంఏ కార్యాలయాన్ని డా.శరద్‌కుమార్‌ సందర్శించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా.బి.ఎన్‌.రావు, డా.విజయ్‌రావు తదితరులతో కలిసి ఐఎంఏ నగరశాఖ కార్యాలయంలో ఐఎంఏ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ స్పెషాలిటీస్‌ నగర విభాగంతోపాటు రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అసోసియేషన్స్‌(ఫోమా) కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో  మాట్లాడుతూ.. హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ వైద్యవిధానాలు అన్నింటినీ కలిపి మిక్సోపతిగా చేయడాన్నే ఐఎంఏ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఐఎంఏ రాష్ట్ర నాయకులు డా.రాజేంద్రకుమార్‌ యాదవ్‌, డా.హలీం, డా.పుల్లారావు, డా.సంపత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని