logo

శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలి

శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలని నగర అదనపు పోలీసు కమిషనర్‌ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్‌మాన్‌ కోరారు.

Published : 30 Mar 2023 02:27 IST

సమావేశమైన అదనపు సీపీ విక్రమ్‌   సింగ్‌మాన్‌, డీసీపీ సునీల్‌దత్‌ తదితరులు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలని నగర అదనపు పోలీసు కమిషనర్‌ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్‌మాన్‌ కోరారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. ఈ నెల 30న అంబర్‌పేట నుంచి సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు నిర్వహించనున్న శోభాయాత్రపై బుధవారం అంబర్‌పేట మున్సిపల్‌ మైదానంలో శోభాయాత్ర నిర్వాహకుడు వెంకట్‌రెడ్డితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు మండలం డీసీపీ సునీల్‌దత్‌, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ ఆకుల శ్రీనివాస్‌, నేతలు మనోజ్‌యాదవ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు