logo

అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు

ఇంటింటికీ తాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ మొదటి దశ పనులు తాండూరులో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు.

Published : 31 Mar 2023 01:07 IST

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): ఇంటింటికీ తాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ మొదటి దశ పనులు తాండూరులో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. అసంపూర్తి పనులతో నీరంతా వృథా కావటంతోపాటు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది వరకే ఏర్పాటు చేసిన పైపులకు నల్లాలు బిగించటంలో  జాప్యం చేస్తున్నారు. పట్టణ వాసులకు ఏళ్ల నుంచి తాగు నీటిని అందిస్తున్న కాగ్నా నది ఒడ్డున ఉన్న పాత, కొత్త పంప్‌హౌస్‌లు పని చేయటం లేదు. విద్యుత్‌ మోటార్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. పట్టణంలోని ఆయా వార్డుల్లో పనులు ఇష్టానుసారం కొనసాగుతున్నాయి. మొత్తం 150 కిలోమీటర్ల పైపుల ఏర్పాటుకు, 112 కిలోమీటర్లు పూర్తి చేశారు. పైపులకు ఇంకా అనుసంధానం చేయాల్సి ఉంది. 12 వేల కనెక్షన్లకు 8,500 మాత్రమే ఇచ్చారు. ఇప్పటికైనా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని