logo

పోషకాహారానికి ఉత్తమమార్గం బాదం

పోషకాహారానికి ఉత్తమ మార్గం బాదం అని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు.

Published : 31 Mar 2023 02:44 IST

బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో బృంద చర్చలో వ్యాఖ్యాత షెజ్జీ, పోషకాహార నిపుణురాలు షీలా కృష్ణస్వామి, వ్యాయామ శిక్షకురాలు కిరణ్‌ డెంబ్లా, ఆయుర్వేద వైద్యురాలు డా.నితికా కోహ్లి

బంజారాహిల్స్‌ న్యూస్‌టుడే: పోషకాహారానికి ఉత్తమ మార్గం బాదం అని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. కౌమారం నుంచి వృద్ధాప్యం వరకు బాదం తింటే ఆరోగ్య బాగుంటుందని పేర్కొన్నారు. ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా సంస్థ ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ బృంద చర్చలో పోషకాహార నిపుణురాలు షీలా కృష్ణస్వామి, వ్యాయామ శిక్షకురాలు కిరణ్‌ డెంబ్లా, ఆయుర్వేద వైద్యురాలు నితికా కోహ్లి పాల్గొని అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమానికి అనుసంధానకర్తగా ఆర్‌జే షెజ్జీ వ్యవహరించారు. ప్రాచీన భారతీయ ఆరోగ్య పద్ధతుల్లో ఒకటైన ఆయుర్వేదానికి సంబంధించి సైతం బాదం పప్పు ఆహారంగా తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. హార్మోన్ల సమతుల్యత, పిల్లల్లో ఎదుగుదల, కండరాల దృఢత్వంతో పాటు పెద్దల్లో మధుమేహం, చెడు కొవ్వు నియంత్రణకు బాదం శ్రేష్ఠమైన ఆహారమన్నారు. ఇందులో ఫైబర్‌ అధికంగా ఉండటంతో దైనందిన జీవనంలో సమతుల్యత కలిగిన ఆహారంగా వినియోగించవచ్చని తెలిపారు. జీర్ణక్రియకు బాదం ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు. కిరణ్‌ డెంబ్లా మాట్లాడుతూ.. బాదం తీసుకోవడం వల్ల వ్యాయామ సమయంలో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రజలు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని