logo

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి

చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వారంపాటు కొనసాగనున్నాయి.

Published : 31 Mar 2023 02:44 IST

ఆలయంలోని కల్యాణ మండపం

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వారంపాటు కొనసాగనున్నాయి. శుక్రవారం అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. ఆలయ ప్రధాన ద్వారానికి కొత్త తలుపులు ఏర్పాటు చేశారు. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సహిత కల్యాణోత్సవ మండపానికి రంగులు వేశారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండటంతో పలు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం ముందు కోనేరును సుందరీకరించారు. క్యూలైన్లలో బారీకేడ్లను ఏర్పాటుచేశారు.

రోజువారీ కార్యక్రమాలు..

* మార్చి 31న సెల్వర్‌కుత్తు, పుట్టమన్ను తీసుకువచ్చి అంకురార్పణ చేస్తారు.
* ఏప్రిల్‌ 1న ఉదయం ధ్వజారోహణం, శేషవాహన పూజలు నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం గరుత్మంతుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని సంతానం లేని భక్తులకు పంపిణీ చేస్తారు. గరుడ ప్రసాదం తీసుకునేందుకు వేలాది మంది భక్తులు విచ్చేస్తారు.
* 2న గోప, హనుమంత వాహన సేవ
* 3న సూర్యప్రభ, సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించిన అనంతరం బాలాజీ, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణోత్సవ కార్యక్రమం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.
* 4న వసంతోత్సవం, గజ వాహన సేవ
* 5న కల్యాణమూర్తులకు పల్లకీ సేవ, రాత్రికి రథోత్సవం.
* 6న మహాభిషేకం, అశ్వవాహనం, ఆస్థానసేవ, దోప్‌సేవ, పుష్పాంజలి
* 7న చక్రతీర్థం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని