logo

Hyderabad: కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

కదులుతున్న కారులోనే డ్రైవర్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటు రాగా, అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ పోలీసు అధికారి అప్రమత్తమై వెంటనే సీపీఆర్‌ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు.

Updated : 31 Mar 2023 08:06 IST

 కారును నియంత్రించి కాపాడేందుకు సీఐ యత్నం
 సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం

శ్రీనివాస్‌కు సీపీఆర్‌ చేస్తున్న రామన్నపేట సీఐ మోతీరామ్‌

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: కదులుతున్న కారులోనే డ్రైవర్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటు రాగా, అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ పోలీసు అధికారి అప్రమత్తమై వెంటనే సీపీఆర్‌ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. బాధితుడు స్పందించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. మలక్‌పేట్‌ ధోబీగల్లీకి చెందిన కావలి శ్రీనివాస్‌(40) భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్‌లో కొన్నాళ్లుగా అద్దెకుంటున్నాడు. క్యాబ్‌ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో క్యాబ్‌లో ఓ కుటుంబాన్ని యాదగిరిగుట్టకు తీసుకెళ్తున్నాడు. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ దాటి కాస్త ముందుకెళ్లగానే శ్రీనివాస్‌కు గుండెనొప్పి రావడంతో గేర్‌ రాడ్‌ వైపు కుప్పకూలిపోయాడు. వెనుక సీటులో ఉన్న ప్రయాణికురాలు అప్రమత్తమె(iవెనుక సీట్‌)లోంచి స్టీరింగ్‌ నియంత్రించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న రామన్నపేట సీఐ మోతీరామ్‌ ముందున్న కారు నెమ్మదిగా వెళ్లడం గమనించి.. ఏం జరిగిందో చూశారు. వెంటనే కిందకు దూకి, మరో వ్యక్తి సాయంతో ఆ కారును నియంత్రించారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ను బయటకు తీసి సీపీఆర్‌ చేయగా స్పృహలోకి రావడంతో వెంటనే తన వాహనంలోనే హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితుణ్ని పరిశీలించిన వైద్యులు ఆయన మృతిచెందినట్లు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని