logo

తెలంగాణలో కలపాలంటున్న మహారాష్ట్ర గ్రామ సర్పంచులు

రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను గుర్తించిన మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాల సర్పంచులు తమ వద్దకు వచ్చి మా గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కోరుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 02:44 IST

రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి

వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను గుర్తించిన మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాల సర్పంచులు తమ వద్దకు వచ్చి మా గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కోరుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.  రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. మోకిల-టంగటూర్‌ల మధ్య మూసీపై రూ.12.90 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు గురువారం ఆయన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే యాదయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కొత్త పంచాయతీ భవనాన్ని, టంగటూర్‌ పాఠశాలలో మన ఊరు-మన బడిలో చేపట్టిన పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి గురించి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గండిపేట చుట్టూ సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేస్తున్నామని ఎంపీ తెలిపారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచి గోపాల్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ శశిధర్‌రెడ్డి, విపణి ఛైర్మన్‌ పాపారావు, రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని