logo

పాత సచివాలయం.. వ్యర్థాలూ సద్వినియోగం

నూతన సచివాలయ భవనం ప్రారంభానికి సిద్ధమవుతోంది. పాత సచివాలయం కూల్చినప్పుడు 1,89,446 టన్నుల నిర్మాణ వ్యర్థాలు పోగయ్యాయి.

Published : 31 Mar 2023 02:44 IST

1.89 లక్షల టన్నులు రీసైక్లింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నూతన సచివాలయ భవనం ప్రారంభానికి సిద్ధమవుతోంది. పాత సచివాలయం కూల్చినప్పుడు 1,89,446 టన్నుల నిర్మాణ వ్యర్థాలు పోగయ్యాయి. చెరువును పూడ్చేంత పరిమాణంలోని ఈ వ్యర్థాలు ఏమయ్యాయనే సందేహాలు సహజమే. బల్దియా సాయంతో వాటిని పర్యావరణానికి మేలు చేసే వనరుగా మార్చామని ఇంజినీర్లు చేబుతున్నారు.
ఏం చేశారంటే.. పాత సచివాలయ భవనం కూల్చినప్పుడు భారీ ఎత్తున కాంక్రీటు స్లాబులు, ఇటుక గోడలు, చెక్క, ఇనుము, మట్టి వంటి వ్యర్థాలు గుట్టలుగా పోగయ్యాయి. జీడిమెట్లలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి వాటిని తరలించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. ఈ మేరకు సచివాలయం నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు జీడిమెట్ల ప్లాంటు నిర్వహణ చూసే రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో ఆ సంస్థ వ్యర్థాల తరలింపు చేపట్టింది. మట్టి వంటివి తప్ప మిగిలిన వ్యర్థాలను పూర్తిస్థాయిలో రీసైకిల్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. బండ రాళ్లు కంకరగా, కాంక్రీటు ఇసుక, సన్న కంకరగా మార్చామని, సిమెంటు, ఇటుకల తయారీకి ముడి సరకుగా ఇవి ఉపయోగపడ్డాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని