logo

రైతులకు రూ.1600 కోట్ల రుణాలిచ్చాం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటి వరకు రూ.1600 కోట్ల రుణాలు ఇచ్చామని డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. కుల్కచర్ల పీఎసీఎస్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.

Published : 01 Apr 2023 03:02 IST

అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్‌రెడ్డి

కుల్కచర్ల: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటి వరకు రూ.1600 కోట్ల రుణాలు ఇచ్చామని డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. కుల్కచర్ల పీఎసీఎస్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు గోదాంలు, రైస్‌మిల్లులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. సహకార సంఘం ఆధ్వర్యంలో పాలసేకరణ, పౌల్ట్రీఫారాలకు దాణా పంపిణీ వంటి వాటివి చేపడుతామని చెప్పారు. పీఎసీఎస్‌ ఆదాయం నుంచి ఆరు వేల మంది రైతులకు గోడ గడియారాలను అందజేస్తామని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతంర వైద్యులు సీపీఆర్‌పై రైతులకు అవగాహన కల్పించారు. డీసీవో శంకరాచారి, పీఎసీఎస్‌ ఉపాధ్యక్షుడు నాగరాజుయాదవ్‌, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలకు..

నవాబుపేట, న్యూస్‌టుడే: సహకార సంఘాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు పోలీస్‌ రాంరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తేనే ఇతరులకు ఇవ్వడానికి వీలుంటుందన్నారు.   గృహ నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. సీఈఓ మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు మల్లారెడ్డి, మల్లేశం, విఠల్‌రెడ్డి, కిష్టయ్య, లక్షణ్‌, ప్రభు, జనార్దన్‌, పుష్పమ్మ పాల్గొన్నారు.

రుణాలు చెల్లించేలా అవగాహన

మోమిన్‌పేట: తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని ప్రాథమిక  సహకార సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పాలకవర్గం సభ్యులను కోరారు. శుక్రవారం మోమిన్‌పేట సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రైతులకు సహకార సంఘం ద్వారా మరిన్ని సేవలు అందించేందుకే కృషి చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని