logo

త్రీడీ ముద్రణతో వంతెన నమూనా

త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెన నమూనాను సిద్ధం చేశామంటున్నారు పరిశోధకులు.

Published : 01 Apr 2023 07:06 IST

నమూనాపై కూర్చున్న ఆవిష్కర్తల బృందం

ఈనాడు, సంగారెడ్డి: త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెన నమూనాను సిద్ధం చేశామంటున్నారు పరిశోధకులు. ఐఐటీ హైదరాబాద్‌లోని సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంతో కలిసి తాము దీన్ని ఆవిష్కరించినట్లు సింప్లిఫోర్జ్‌ అంకుర సంస్థ శుక్రవారం పేర్కొంది. త్రీడీ కాంక్రీట్‌ ముద్రణ ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ రూపొందించిన వంతెన ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. మెటీరియల్‌ ఫాలోస్‌ ఫోర్స్‌ అనే విధానాన్ని ఉపయోగించి రూపొందించారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే సిద్ధం చేసి సిద్దిపేటలో ఓచోట ఉంచి ఎంత మేర బరువును తట్టుకుంటుందో పరీక్షలు చేస్తున్నారు.నిర్మాణ రంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఐఐటీహెచ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగ ఆచార్యులు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని