logo

సేవా లోపాలపై కొరడా

సైదాబాద్‌కు చెందిన విక్రమ్‌ ప్రతివాద సంస్థలో జీవిత బీమా పాలసీ 2014లో తీసుకున్నారు. 2044 వరకు దీని గడువు. ప్రతినెలా రూ.9,425 ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు.

Published : 01 Apr 2023 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైదాబాద్‌కు చెందిన విక్రమ్‌ ప్రతివాద సంస్థలో జీవిత బీమా పాలసీ 2014లో తీసుకున్నారు. 2044 వరకు దీని గడువు. ప్రతినెలా రూ.9,425 ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ 2021 జూన్‌లో మరణించారు. బీమా డబ్బు చెల్లించాలంటూ అతడి భార్య ప్రతివాద సంస్థను ఆశ్రయించగా క్లెయిమ్‌ తిరస్కరించారు. విచారించిన వినియోగదారుల  కమిషన్‌-2 క్లెయిమ్‌ మొత్తం రూ.75లక్షలు, రూ.లక్ష పరిహారం, రూ.10వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.

* ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌ డివిజన్‌కు వినియోదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. బంజారాహిల్స్‌కు చెందిన సీహెచ్‌ బాలక్రిష్ణరావు ఫిర్యాదును విచారించిన కమిషన్‌ ఈ మేరకు తీర్పు వెలువరించింది. రూ.13,048 తిరిగి చెల్లించడంతో పాటు రూ.10వేలు పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది.
* లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎస్‌.రాజశేఖర్‌ ఫిర్యాదును విచారించిన కమిషన్‌ పంజాగుట్ట, ముంబయిలోని శాఖలను బాధ్యులను చేస్తూ  రూ.3,01,271 మరమ్మతులకు చెల్లించడంతో పాటు రూ.20వేలు పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని